
ఉద్యోగుల సెలవులు రద్దు – భారీ వర్షాలు పై సీఎం సమీక్ష
ఆర్టికల్ టుడే, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు…