ఆర్టికల్ టుడే, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రిత్విక్ రాజ్ (20) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, మృతదేహాన్ని ప్రస్తుతం అత్తాపూర్ మైత్రి హాస్పిటల్‌లో ఉంచినట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్రికల్చరల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
